ట్యాంకర్లు రాక.. అనకాపల్లిలో డీజిల్ ఖాళీ: ఆరు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు

ట్యాంకర్లు రాక.. అనకాపల్లిలో డీజిల్ ఖాళీ: ఆరు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు

28/April/2026 06:48    Share:   

అనకాపల్లిలో డీజిల్ కటకట..
శ్రీనివాస్ రావు . ఎ క్రైమ్ ఎనాలసిస్ , జిల్లా ఇంచార్జ్,అనకాపల్లి.
అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో డీజిల్ కొరత వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పట్టణ సరిహద్దుల్లో ఉన్న సుమారు ఆరు పెట్రోల్ బంకుల్లో డీజిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆటోలు, లారీలతో పాటు ప్రభుత్వ, ఇతర డీజిల్ ఆధారిత వాహనాలు రోడ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది.సరఫరా కేంద్రాల నుంచి రావాల్సిన డీజిల్ ట్యాంకర్లు సకాలంలో బంకులకు చేరుకోకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ అకస్మాత్తు కొరత వల్ల ముఖ్యంగా సరుకు రవాణా రంగం తీవ్రంగా దెబ్బతింది. రోజువారీ ఆదాయంపైనే ఆధారపడి జీవించే ఆటో, లారీ డ్రైవర్లు డీజిల్ దొరకక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవలు నిలిచిపోవడంతో పాటు, సరుకుల రవాణాలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.అధికారులు వెంటనే స్పందించాలి..ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎక్కడైనా డీజిల్ బ్లాక్ మార్కెట్ దందా జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. సివిల్ సప్లై శాఖ అధికారులు, వీఆర్వోలు తక్షణమే విధుల్లో ఉండి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని, బ్లాక్ మార్కెట్‌ను కఠినంగా అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకుని డీజిల్ సరఫరాను సకాలంలో పునరుద్ధరించాలని, రవాణా రంగానికి ఉపశమనం కల్పించాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter