డిగ్రీ కళాశాలలో మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన సదస్సు..

డిగ్రీ కళాశాలలో మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన సదస్సు..

19/August/2026 20:17    Share:   

ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలపై ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన సదస్సుఎలమంచిలి, ఆగస్టు 19:స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధించడం, అశ్లీల సందేశాలతో బెదిరింపులకు గురిచేయడం వంటి అంశాలపై విద్యార్థినులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ డా. కె. సుజాత, ఇంగ్లీష్ అధ్యాపకురాలు డా. పద్మప్రియ మాట్లాడుతూ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు విద్యార్థినులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా 'దిశ' యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.కంప్యూటర్ అధ్యాపకురాలు దేవి, సంధ్యలు డిజిటల్ భద్రతా ప్రమాణాలు, అకౌంట్ల ప్రైవసీ సెట్టింగ్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బోటనీ అధ్యాపకురాలు రాజేశ్వరి, ఇతర మహిళా అధ్యాపక సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter