వేడెక్కిన యలమంచిలి మున్సిపల్ రాజకీయం..

వేడెక్కిన యలమంచిలి మున్సిపల్ రాజకీయం..

03/October/2026 20:21    Share:   

​యలమంచిలి :

యలమంచిలి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ రాకముందే యలమంచిలి పట్టణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. గతేడాది ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా అదే పట్టును నిలుపుకోవాలని పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. స్థానికంగా పట్టు సడలకుండా ఇప్పటినుంచే వార్డుల వారీగా శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ​మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి బలం పుంజుకోవడంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి యలమంచిలి మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగురవేయాలని నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే పొత్తు ధర్మానికి అనుగుణంగా వార్డుల్లో సంయుక్తంగా పర్యటిస్తూ, ప్రజాసమస్యలను తెలుసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ​ఇరువర్గాల అంతర్గత ఎత్తుగడలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో యలమంచిలి స్థానిక సమరం ముందే హీటెక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వేస్తున్న వ్యూహాలు పట్టణంలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.  గ్రామపంచాయతీ నుంచి 2011 వ సంవత్సరంలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన యలమంచిలి మున్సిపాలిటీలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పిల్లా రామాకుమారి గెలుపొందారు. తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున చైర్పర్సన్ గా పిల్లా రామాకుమారి గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లో టిడిపి, వైసిపి పార్టీలు చెరొకసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నాయి. ఈసారి జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కూటమి పార్టీ ప్రయత్నిస్తున్నది. యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆశీస్సులతో జనసేన పార్టీ ఆశావాహులు రంగంలో దిగే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా టిడిపి తరఫున ఆశావహులు టికెట్ ఆశిస్తున్న 9 మంది ఆశావహులు ఉన్నారు. వైసిపి పార్టీ తరఫున ఆరుగురు ఆసావహులు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో 25 వార్డులతో ఉన్న యలమంచిలి మున్సిపాలిటీ వార్డుల విభజన అనంతరం 32 వార్డులకు పెరిగాయి. 36,526 మంది ఓటర్లతో రానున్న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
Breaking News

Subscribe our Newsletter