బీజేపీ విజయాలకు బూత్‌లే వెన్నెముక,రేగిపాలెంలో మండల బూత్ కోఆర్డినేషన్ సమావేశం విజయవంతం...!

బీజేపీ విజయాలకు బూత్‌లే వెన్నెముక,రేగిపాలెంలో మండల బూత్ కోఆర్డినేషన్ సమావేశం విజయవంతం...!

15/June/2026 10:43    Share:   

ఎలమంచిలి , జూన్ 15 (క్రైమ్ ఎనాలిసిస్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయిలో పార్టీ విస్తరణ, కార్యకర్తల సమన్వయమే లక్ష్యంగా మండల బూత్ కోఆర్డినేషన్ సమావేశం ఆదివారం రాత్రి 8 గంటలకు రేగిపాలెం గ్రామంలో కొల్లి సత్యనారాయణ నివాసంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు, మండల కార్యవర్గ సభ్యులు, 26 మంది బూత్ అధ్యక్షులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి పిల్ల రమాకుమార్, బి.వి.ఎస్. వర్మ, కొరుప్రోలు చిన్నారావు, ఆడారి చిన్న, బొడ్డేడ నాగేశ్వరరావు, నక్క శివశంకర్, కొల్లి సత్యనారాయణలు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు ధారా నూకరాజు, సప్ప లోవరాజు, సురకాసుల గోవింద్, మొల్లి అప్పారావు, నాగిరెడ్డి శ్రీనుబాబు, కడారి అప్పలరాజు, కడారి దుర్గారావు, చుక్కల శ్రీనివాసరావు, లావేటి సురేష్, ఉగ్గిన బాబ్జి, దుర్గాప్రసాద్, రాజేష్‌తో పాటు 26 మంది బూత్ అధ్యక్షులు, పలువురు కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేశారు.
Breaking News

Subscribe our Newsletter