ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న సీసీఆర్ (CCR)

ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న సీసీఆర్ (CCR)

20/May/2026 07:54    Share:   

ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలోని ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణలపై రేపు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించనున్నట్లు సీసీఆర్ (CCR) కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నిరసన, వినతిపత్రం సమర్పణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు (గురువారం)ఉదయం 10:00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, పాడేరు నందుసభ్యులందరూ హాజరు కావాలిని విజ్ఞప్తి చేసారు. ప్రజల హక్కులు, పారదర్శక పాలన, బాధ్యతాయుతమైన పరిపాలన కోసం సీసీఆర్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో అందరూ సకాలంలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8500100674, 9494132082, 9949319239 నంబర్లలో సంప్రదించవచ్చు.

 
Breaking News

Subscribe our Newsletter