లంకెలపాలెం జంక్షన్‌లో మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలి: మడక శివపార్వతి

లంకెలపాలెం జంక్షన్‌లో మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలి: మడక శివపార్వతి

17/April/2026 15:12    Share:   

లంకెలపాలెం
క్రైమ్ అనాల్సిస్, టివియస్ ప్రకాష్ :
గ్రేటర్ విశాఖ పరిధిలోని లంకెలపాలెం 79, 85 వార్డులకు అనుసంధానంగా ఉన్న లంకెలపాలెం జంక్షన్‌లో రోడ్డుకు ఇరువైపులా మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలని సంరక్షణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు మడక శివపార్వతి డిమాండ్ చేశారు.ఈ ప్రధాన కూడలిలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో స్థానిక వ్యాపారులు, అలాగే ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎండాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, వేలాదిమంది ప్రయాణికులు తాగునీటి కోసం డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.లంకెలపాలెం జంక్షన్‌లో చిన్నతరహా టిఫిన్ సెంటర్లు, జ్యూస్ షాపులు, టీ దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, నీటి కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.జీవీఎంసీ పరిధిలో ఇంత రద్దీగా ఉండే జంక్షన్‌లో కనీసం ఒక్క మంచినీటి బోరు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఫార్మాసిటీకి వెళ్లే కార్మికులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు, జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో కనీసం రెండు మంచినీటి బోర్లు అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి లంకెలపాలెం జంక్షన్‌లో మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
Breaking News

Subscribe our Newsletter