మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు..!

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు..!

08/July/2026 21:05    Share:   

ఘనంగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నాయకులు..!!
 
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
 
మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
 
ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన సాగిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు బోదెపు గోవింద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేపు గుప్త, బెజవాడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ బొద్దపు ఎర్రయ్య దొర, రూరల్ పార్టీ అధ్యక్షుడు కొల్లి త్రినాథ్, మాజీ సర్పంచ్ గొన్నాబత్తుల శివ, సీనియర్ నాయకులు దాసరి కుమార్, పిల్లా త్రినాథ్, కోడిగుడ్డు రమణ, ఎడ్ల వాసు, కొఠారు వెంకటేశ్వరరావు, గొంపాని శివ, ఉప్పులూరి కిరణ్, శ్రీరామ్మూర్తి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter