కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే రోడ్డు నిర్వాసితుల ధర్నాను జయప్రదం చేయండి ,
15/July/2026 19:10
Share:
అనకాపల్లి నుండి అచ్చుతాపురం రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు, షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఈనెల 17వ తేదీ శుక్రవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో రోడ్డు నిర్వాసితులందరూ పాల్గొని జయప్రదం చేయాలని మోసయ్యపేట, చోడపల్లి, కొండకర్ల,హరిపాలెం, తిమ్మరాజుపేట గ్రామాల నిర్వాసితులకు కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేయడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్వాసితుల నాయకులు కె సోము నాయుడు మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో నష్టపోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉండాలి కానీ నేటి ప్రభుత్వం పరిహారం కాకుండా టి డి ఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం అంటే నిర్వాసితులను మోసం చేయడమేనని గత ప్రభుత్వం గజంకు 18000వేల నుండి 25000వేలు ఇస్తామని అందరి ఆమోదం తీసుకున్నారని కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకుండా టిడిఆర్లు ఇస్తామని కొత్త ఆదేశాలు తీసుకొచ్చింది దీనిపై నిర్వాసితులు కోర్టుకు వెళ్లారని కోర్టు ఆదేశాలు గ్రామీణ ప్రాంతంలో టిడిఆర్ బాండ్లు చేల్లవు అని నగదు పరిహారం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా నేటికీ దానిని అమలు చేయకుండా నిర్వాసితులను అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారని రోడ్డు కిరువైపులా పంట కాలువల ను ధ్వంసం చేసి రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిర్వాసితులను మోసం చేస్తున్నారు వెంటనే నష్టపోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి రోడ్డు, వంతెన పనులు పూర్తిచేయాలని కోరుతూ జరిగే కలెక్టరేట్ కు నిర్వచనాలు అందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం టు అనకాపల్లి నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్ రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు, ఎస్ బ్రహ్మాజీ , ఎస్ రామ సద శివ, ఎస్ బాబురావు, కె రమేష్, ఈ గంగరాజు, కే శంకర్, గణపతి రావు నిర్వాసితులు పాల్గొన్నారు.