యలమంచిలి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ జన్మదిన వేడుకలు యలమంచిలి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బొద్ధపు ఎర్రయ్య దొర కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బోదెపు.గోవిందు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోద్దపు ఎర్రయ్య దొర మాట్లాడుతూ రాజకీయంగా 30 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకీయ వ్యక్తి కరణం ధర్మశ్రీ అని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరము పోరాడే యోధుడని అన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటారని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సేనాపతి. సంధ్యారాం, వైస్ చైర్మన్ అర్రేపు. గుప్తా, పార్టీ అధ్యక్షులు కొల్లి. త్రినాధరావు,కౌన్సిలర్లు పిట్ట. సత్తిబాబు,దూది. నరసింహమూర్తి, దుంగ. అచ్యుతరావు, వైయస్సార్ సిపి నాయకులు కొటారు. కొండబాబు,దాసరి.కుమార్, కోడిగుడ్డు. రమణ, యూటీఆర్. పిల్లా. త్రినాథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.