జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్‌గా కె. చక్రవర్తి బాధ్యతల స్వీకరణ

జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్‌గా కె. చక్రవర్తి బాధ్యతల స్వీకరణ

15/July/2026 19:01    Share:   

అనకాపల్లి, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్‌గా కె. చక్రవర్తిని నియమించిన నేపథ్యంలో, ఆయన ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన కె. చక్రవర్తి, అనకాపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
పారిశుద్ధ్యం, పట్టణాభివృద్ధి, ప్రజా సేవలకు ప్రాధాన్యత ఇస్తూ అనకాపల్లి జోన్ అభివృద్ధికి కృషి చేస్తానని కె. చక్రవర్తి తెలిపారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించే దిశగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఏ. శ్రీనివాస రావు,క్రైమ్ ఎనాలిసిస్,జిల్లా ఇన్చార్జి,అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter