శ్రీ భగీరథి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనం..

శ్రీ భగీరథి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనం..

11/September/2026 16:33    Share:   

శ్రావణ మాసం 5వ శుక్రవారం, అమావాస్య సందర్భంగా విశేష పూజలు – భక్తుల రద్దీ

హరిపాలెం: అందలపల్లి కొండపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ భగీరథి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ మాసం ఐదవ శుక్రవారం మరియు అమావాస్య సందర్భంగా అమ్మవారికి విశేష శ్రీ మహాలక్ష్మి అలంకరణను నిర్వహించారు.

అమ్మవారి దివ్యరూపం, పుష్పాలంకరణలు, విశేష అభరణాలతో కొండంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రావణ మాసంలో శుక్రవారం పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో, ఈ రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అమ్మవారి దర్శనం చేసుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు ఉత్సాహంగా వస్తున్నారు. కొండపై ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, స్వచ్ఛంద సేవకులు ఏర్పాట్లు చేశారు.

శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల కుటుంబంలో సిరిసంపదలు వర్ధిల్లుతాయని, అమ్మవారి కృపా కటాక్షం లభిస్తుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News

Subscribe our Newsletter