ఎలమంచిలి పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారి పంచ నవరాత్రుల మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు, కూటమి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పిల్లా రమాకుమారి గారు, కూటమి కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ప్రజలందరిపై భూలోకమాంబ అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఇలాంటి పుణ్యకార్యక్రమాలు సమాజంలో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఎలమంచిలి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతరం పిల్లా రమాకుమారి గారు మాట్లాడుతూ, భూలోకమాంబ అమ్మవారి ఆశీస్సులు ఎలమంచిలి ప్రజలందరిపై ఉండాలని, పట్టణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.