పేదల పెన్నిధి కూటమి ప్రభుత్వం..! ఎమ్మెల్యే విజయకుమార్..!!
29/April/2026 20:50
Share:
క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ యలమంచిలి : యలమంచిలి, కూటమి ప్రభుత్వం పేదలకు వరమని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పేర్కొన్నారు. బుధవారం జడ్పీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అనంతరం వివిధ సమస్యలతో బాధపడుతున్న 17 మంది లబ్ధిదారులకు రూ.8.48 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ, పేద ప్రజలు తమ సమస్యలను జనవాణి ద్వారా తెలియజేసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం చూపడం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, జనసేన నాయకులు బద్ధపు శ్రీను, ఊటకూటి రమేష్, కొటారి శ్రీను, మోటూరి గోపినాథ్, నూకన్న దొర, కొఠారి నరేష్, పల్లా సత్యనారాయణ, జయరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి కూటమి నాయకులు, బాధితులు హాజరయ్యారు.