ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: బాధితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ భారీ ధర్నా.

ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: బాధితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ భారీ ధర్నా.

05/April/2026 20:40    Share:   

అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం ఒక పసికందు ప్రాణాన్ని బలిగొంది. ఆసుపత్రిలో కరెంటు పోవడం, ప్రత్యామ్నాయంగా ఉన్న జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి మూడు రోజుల పసికందు కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటనపై కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట భారీ ధర్నాకు దిగారు.ఏప్రిల్ 1వ తేదీన ఓ గర్భిణీ ప్రసవం కోసం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేరగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన బాబుకు పచ్చకామెర్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ప్రత్యేక వార్డుకు తరలించి ఆక్సిజన్ సపోర్ట్ పై ఉంచారు.కానీ, నిన్న ఆసుపత్రిలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు పోయిన వెంటనే ఆన్ చేయాల్సిన జనరేటర్ పనిచేయలేదు. దానికి తోడు ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది కూడా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఊపిరి అందక విలవిలలాడిన ఆ మూడు రోజుల పసికందు ప్రాణాలు విడిచాడు.ప్రాణాలతో ఇంటికి వెళ్తాడనుకున్న బాబు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రి సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతుని కుటుంబానికి అండగా నిలిచారు. అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.చిన్నారి మృతికి కారణమైన ఆసుపత్రి నిర్వాహకులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పసికందు మరణానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుబట్టారు. దీంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
క్రైమ్ అనాలసిస్:A. Srinivasa Rao,జిల్లా ఇన్చార్జి,అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter