టిడ్కోలో మంచినీటి సమస్య వెంటనే స్పందించిన డి ఇ ఈ కనకరాజు

టిడ్కోలో మంచినీటి సమస్య వెంటనే స్పందించిన డి ఇ ఈ కనకరాజు

01/March/2026 07:25    Share:   

యలమంచిలి /టిడ్కో కాలనీలో సి1 బ్లాకులో మంచినీటి సమస్య తలెత్తడంతో బాధితులు పిలుపుమేరకు మున్సిపాలిటీ డిప్యూటీ ఇ ఇ కనకరాజు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి, శుద్ధ వాటర్ కారణంగా పైపులు స్ట్రక్ అవుతున్నాయని, మూడు రోజుల్లో వర్కర్స్ చే పైపులు, మేన్ హోల్స్ క్లీనింగ్ కార్యక్రమం చేయిస్తామన్నారు. గ్రౌండ్ లెవెల్ ట్యాంకును కూడా పరిశీలించి, అడుగున పట్టేసిన శుద్ధ కారణంగా పంపింకి ఆటంకం కలుగుతుందని ట్యాంక కూడా క్లీన్ చేయవలసి ఉన్నదని త్వరలోనే క్లీన్ చేస్తామన్నారు. 
మూడు సంవత్సరాలు కాల వ్యవధి రావడంతో మోటార్లు కూడా లోడ్ ఎత్తడం కష్టమవుతుందని, అవసరాన్ని బట్టి మోటార్లు కూడా మార్చుకోవాల్సి వస్తుందన్నారు. రానున్న ఎండాకాలం కావడంతో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, బ్లాక్ ల ఇన్చార్జులు, బాధిత మహిళలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter