ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి,సిఐటియు .

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి,సిఐటియు .

10/October/2026 15:36    Share:   

దేశవ్యాప్తంగా 14 కోట్ల ఓట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎన్నికల ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఈరోజు పూడిమడకలో నిరసన తెలియజేసి ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మత్స్య కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో 14 కోట్ల మందిని ఓటర్ల లిస్టు నుండి తొలగించారని పేద, కార్మికులు ,మైనార్టీలు, వలస కార్మికులు మరియు మహిళలు ఓట్లు దీనిలో ఉన్నాయని మన రాష్ట్రంలో సుమారు 45 లక్షల మందిని తొలగించారని వారు ఓటు హక్కును తిరిగి వెంటనే పునరుద్ధరించాలని పోరాడి సాధించుకున్న ఓటు హక్కును 18 ఏళ్లు దాటిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ ముగ్గురిలో ముఖ్య కమిషనర్ ఏకపక్షంగా బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా బిజెపి వ్యతిరేక ఓట్ల తొలగించారని దీనిపై 14 సార్లు మరో ఇద్దరు కమీషనర్లు పార్లమెంటరీ కమిటీకి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని వీటిపై విచారణ జరిపి ప్రధాన ఎన్నికల కమిషనర్ను వెంటనే విధులను తొలగించి అందరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి సతీష్ ,కాసులు, చిన్నయ్య తాత తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter