థిలమైన పాత భవనం,ఆగిన కొత్త నిర్మాణం! ఏటికొప్పాక ఆరోగ్య కేంద్రానికి మోక్షమెప్పుడు?

థిలమైన పాత భవనం,ఆగిన కొత్త నిర్మాణం! ఏటికొప్పాక ఆరోగ్య కేంద్రానికి మోక్షమెప్పుడు?

29/July/2026 20:04    Share:   

అనకాపల్లి జిల్లా | క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో విలేజ్ హెల్త్ క్లినిక్ పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఉన్న ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం భవనం పూర్తిగా పాడైపోవడంతో కొత్త భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టినా, స్తంభాలు వేసి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రెండు భవనాల చుట్టూ ప్రస్తుతం చెట్లు, తుప్పలు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి నిరుపయోగంగా మారాయి.
విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో లేకపోవడంతో సచివాలయం–1సచివాలయం–2లను వేర్వేరు అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులు అద్దెల రూపంలో ఖర్చవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజలకు సొంత భవనం అందుబాటులో లేకపోవడం.. మరోవైపు అద్దెలకు ప్రజాధనం ఖర్చు కావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిలిచిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేసి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఎలమంచిలి ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ చూపాలని ఏటికొప్పాక గ్రామ ప్రజలు కోరుతున్నారు.ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడాల్సిన భవనం ఇలా చెట్లూ తుప్పల్లో కలిసిపోవడం ఇకనైనా మారుతుందా? అధికారులు స్పందిస్తారా? అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter