జిల్లా కారాగారాన్ని సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు
18/April/2026 07:16
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, ఏప్రియల్ 17: రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు ఏలూరు నగరంలోని శుక్రవారం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఆహార పదార్థాలను, పరిసరాలను పరిశీలించి కొన్ని సూచనలను జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ ప్రతి నెలలో తనిఖీల్లో భాగంగా ఈరోజు జిల్లా కారాగారాన్ని సందర్శించడం జరిగిందని, ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయాలుపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.అలాగే ఆర్థికంగా వెనకబడి న్యాయవాది నియమించుకోలేని ముద్దాయిలకు ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఖైదీలు యొక్క కుటుంబ సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను పొందుటంలో అవసరమైన న్యాయ సహాయాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కోనే.సీతారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వరప్రసాదు, జిల్లా కారాగార సూపరింటెండెంటు నరసింహారెడ్డి, జైలరు కె.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.