ఏలూరు: ఏలూరు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. స్థానిక సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి గారితో పాటు స్థానిక శాసనసభ్యులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా ఏలూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను మరియు అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిపై స్పందించిన ముఖ్యమంత్రి గారు,పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.