గ్రామీణ ప్రాంతాల్లో NALSA కమ్యూనిటీ మధ్యవర్తిత్వం..

గ్రామీణ ప్రాంతాల్లో NALSA కమ్యూనిటీ మధ్యవర్తిత్వం..

22/August/2026 19:27    Share:   

గ్రామీణ ప్రాంతాల్లో “కోర్టు కేసులు లేని గ్రామాల” దిశగా కమ్యూనిటీ మధ్యవర్తిత్వం

రిపోర్టర్ కన్నేపల్లి నాగ శ్రీనివాస శర్మ

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) రూపొందించిన “Community Mediation – Towards a Litigation-Free Rural India” Standard Operating Procedure (SOP) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న వివాదాలను కోర్టులకు వెళ్లకుండానే పరస్పర చర్చలు, అవగాహన మరియు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు ఒక వ్యవస్థను రూపొందించారు.
కమ్యూనిటీ మధ్యవర్తిత్వం ప్రధాన ఉద్దేశ్యం గ్రామాల్లో వివాదాలు పెద్దవిగా మారి కోర్టు కేసులుగా మారకుండా ప్రారంభ దశలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించడం. కుటుంబ సంబంధాలు, పొరుగువారి వివాదాలు, భూ సరిహద్దులు, ఆస్తి, నీటి వినియోగం, చిన్నపాటి డబ్బు బకాయిలు తదితర వివాదాలను పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించవచ్చు.
Breaking News

Subscribe our Newsletter