డైట్ ఎంబీఏ విద్యార్థులకు “అకౌంట్స్ అండ్ ట్యాక్సెస్” పై అవగాహన కార్యక్రమం
26/February/2026 18:08
Share:
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ - అటామిస్ కళాశాల నందు ఎంబీఏ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కోసం “అకౌంట్స్ అండ్ ట్యాక్సెస్” అంశంపై అవగాహనకార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు విచ్చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్" అకౌంట్స్ అండ్ టాక్సెస్ " ప్రాక్టీషనర్ శ్రీ మామిడి బాలాజీ గారు ముఖ్యంగా ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుత కాలంలో అకౌంటింగ్ మరియు పన్నుల ప్రాముఖ్యతపై సమగ్ర అవగాహన ఉండాలని తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రస్తుత సమాజంలో వ్యాపార నిర్వహణలో అకౌంటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, సరైన ఆర్థిక నిర్వహణకు మరియు వ్యాపార అభివృద్ధికి పన్నుల పరిజ్ఞానం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ, ఆదాయపు పన్ను, ఆర్థిక నివేదికల తయారీ, పన్ను ప్రణాళిక వంటి అంశాలపై విద్యార్థులకు వివరంగా తెలియజేశారు.తదుపరి ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ పి. బి. రామ కుమార్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలోనైనా, ఉద్యోగరంగంలోనైనా మేనేజర్లుగా ఎదగాలంటే ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టు ఉండాలని, అకౌంట్స్ మరియు ట్యాక్సెస్ పై అవగాహన వృత్తి మరియు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. చివరిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠ రావు గారు మాట్లాడుతూ ప్రతి ఎంబీఏ విద్యార్థి అకౌంట్స్ మరియు పన్నుల అనగా సి జి ఎస్ టి మరియు ఎస్ జి ఎస్ టి గురించి తెలుసుకోవాలని వీటిపై ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రాయోగిక జ్ఞానాన్ని పొందారని మరియు వారి సందేహాలకు సమాధానాలు లభించాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబీఏ అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.