అనకాపల్లిలో జిల్లా కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు..

అనకాపల్లిలో జిల్లా కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు..

25/September/2026 18:14    Share:   

అనకాపల్లి: ప్రత్యేక జిల్లా ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కేంద్రానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలన్నీ అనకాపల్లిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో కలిసి జీవీఎంసీ నూతన కార్యాలయ భవనం, పాత జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ స్థలాలను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో పరిపాలనా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతులు, భవనాల లభ్యతపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. పాత జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ స్థలంలో జీ+3 అంతస్తుల భవన నిర్మాణానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే జీవీఎంసీ నూతన కార్యాలయ స్థలాన్ని కూడా పరిపాలనా అవసరాలకు అనుగుణంగా పరిశీలించారు.
జిల్లా కేంద్రానికి సంబంధించిన కార్యాలయాలు అనకాపల్లిలోనే అందుబాటులోకి వస్తే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter