​కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణపై  ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు

​కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణపై  ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అధికారులు

07/October/2026 06:40    Share:   

​యలమంచిలి :

మండలంలోని కొత్తూరు గ్రామంలో బిన్ బ్యాగ్ నిర్వహణ తీరుపై మంగళవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎంపీడీఓ (ఎఫ్ఎసీ) వి.దీపిక, పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్‌ ల ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి బిన్ బ్యాగ్ విధానం అమలు అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ సందర్భంగా పలువురు గృహ యజమానులతో మాట్లాడి చెత్త సేకరణ, నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు బిన్ బ్యాగ్ విధానాన్ని క్రమం తప్పకుండా పాటిస్తుండటంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ​ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter