కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు బిఎస్ఎన్ఎల్ సేవల విస్తరణలో యువత భాగస్వామ్యం కావాలి,జనరల్ మేనేజర్ సి.వి.సి రామరాజు,ఐటిఎస్ పిలుపునిచ్చారు. C. V. Rama Raju ITS, గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు బిఎస్ఎన్ఎల్ ద్వారా మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామాలు, పట్టణాలలో బిఎస్ఎన్ఎల్ పార్ట్నర్షిప్ ద్వారా సేవలను విస్తరించి, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ యువత స్వయం ఉపాధి పొందవచ్చని ఆయన సూచించారు. అలాగే కేబుల్ ఆపరేటర్లు కూడా బిఎస్ఎన్ఎల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్ మరియు మొబైల్ సేవలను ప్రజలకు చేరవేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ 4జి సేవలు నాణ్యమైన కనెక్టివిటీతో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజలు విశ్వసనీయమైన టెలికాం సేవలను పొందేందుకు బిఎస్ఎన్ఎల్‌ను అధికంగా వినియోగించాలని ఆయన కోరారు. దేశీయ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి సంస్థ అనేక ఆధునిక సాంకేతిక సేవలను ప్రవేశపెడుతోందని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.