ఏటికొప్పాకకు పరిశుభ్రత పిలుపు.. పారిశుద్ధ్యంపై కార్యదర్శి ప్రత్యేక దృష్టి!
30/July/2026 19:09
Share:
కార్మికుల పెంపు.. క్రేన్ మిషన్‌తో చెత్త తొలగింపు.. మైక్ ద్వారా ప్రజలకు అవగాహన
అనకాపల్లి జిల్లా, జూలై 30 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామ కార్యదర్శి ఇన్‌చార్జ్ కె. గిరిప్రసాద్ రావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నాలుగు గ్రామాలకు ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పటికీ ఏటికొప్పాకలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పారిశుద్ధ్య కార్మికులను పెంచి మెరుగైన సేవలు అందిస్తున్నారు.గ్రామంలో వీధివీధి పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ్రామ ముఖద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తను క్రేన్ మిషన్ సహాయంతో తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. అలాగే శానిటైజేషన్, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక మైక్ ద్వారా వీధివీధిలో అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యం, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనులను పర్యవేక్షిస్తున్న కార్యదర్శి గిరిప్రసాద్ రావు చొరవను గ్రామస్తులు అభినందిస్తున్నారు.