రిపోర్టర్. క్రైమ్ ఎనాలసిస్. కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ
యలమంచిలి/స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 - 27 విద్యా సంవత్సరంలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ.చంద్రశేఖర్ తెలిపారు.
ఎం ఎస్ సి కి సంబంధించి ఎనలిటికల్ కెమిస్ట్రీ ఒకటి, డిగ్రీ కు సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఒకటి ఖాళీగా ఉన్నాయి.
డిగ్రీ మరియు పీజీ కి సంబంధించి సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55 శాతానికి మించి మార్కులు కలిగిన అభ్యర్థులు పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. దీనితో పాటు యూజీసీ నియమ నిబంధనలు ప్రకారం నెట్, స్లెట్, పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు కళాశాలలో దరఖాస్తులను సమర్పించి ఈ జూన్ నెల 29 వ తేదీ 2026 మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కళాశాల
ఐ క్యూ ఏ సి ( ఐక్యూ ఏసీ) లో జరిగే ఇంటర్వ్యూ లకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
వీరితోపాటు కళాశాలలో 2025- 26 విద్యా సంవత్సరంలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పూర్తి విధులు నిర్వర్తించిన ఇంగ్లీష్ -1, హిస్టరీ-1 కామర్స్ -2, బోటని - 2 కెమిస్ట్రీ - 4 కంప్యూటర్ సైన్స్ - 3 లైబ్రరీ సైన్స్ - 1 విభాగాల గెస్ట్ అధ్యాపకులు కూడా 2026-27 రెన్యువల్ కొరకు ఈ ఇంటర్వ్యూల కు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ తెలియజేశారు.