రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6,400  కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి..

రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6,400  కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి..

22/June/2026 20:06    Share:   

#పేపర్ల ప్రకటనలకే పరిమితమైన ఫీజు రియంబర్స్మెంట్,
#బకాయిలు కోర్స్ పూర్తి చేసుకున్న సర్టిఫికెట్లు అందక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు,కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తో సంబంధం లేకుండా తక్షణమే సర్టిఫికెట్లు అందజేయాలి,
#విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
#ఏలూరు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏలూరు  జిల్లా అధ్యక్షులు కార్యదర్శి డి. శివ కుమార్, సిద్దు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేస్తాం మన ప్రభుత్వం ప్రతి అకాడమీ క్లియర్ మొదటి లోనే కళాశాలల ఖాతాలలో జమ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుకున్న విద్యార్థులకు దాదాపు పదివేల 700 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు ప్రతి అసెంబ్లీ సమావేశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలు చేస్తామని ప్రకటిస్తున్నారు కానీ విద్యార్థుల ఖాతాలలో అవి జమ కాకుండా కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజుల బకాయిలు 10,700 కోట్లు చెల్లించాలి..గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలకి కలిపి మొత్తం 9  క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్ మెంట్  బకాయిలు 6,300 కోట్లు విడుదల చేయాలి.గత రెండేళ్ల నుండి 2,200 కోట్ల రూపాయిలు స్కాలర్ షిప్ బకాయిలు చెల్లించలేదు..2026-27 బడ్జెట్ లో ఫీజుల పధకానికి 2,766 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రతీ ఏడాది ఫీజుల పధకానికి 3,900 కోట్లు కేటాయించాలి.వసతి దీవెన పథకం ద్వారా జగన్ హయాంలో ఐటీఐ  విద్యార్థులకి 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకి 15 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులకు 20 వేలు చెల్లించారు.బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ lo 1200 కోట్లు కేటాయించి కేవలం 600 కోట్లు మాత్రమే విడుదల చేసిన కూటమి సర్కారు. రాష్ట్రంలో 11 లక్షల మంది ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థుల్ని ఫీజుల పధకానికి దూరం చేస్తున్న కూటమి సర్కార్ అని మండిపడ్డారు తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అమ్మబడి పథకం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సిద్దు, ఏఐఎస్ఎఫ్, నాయకులు గోపి, తరుణ్,అశోక్, ప్రశాంత్, ఆదిత్య, మరియు విద్యార్థులు పాల్గొన్నారు*
Breaking News

Subscribe our Newsletter