మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్‌పై దాడి – కారు ధ్వంసం..!

మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్‌పై దాడి – కారు ధ్వంసం..!

29/April/2026 07:10    Share:   

నర్సీపట్నంలో ఉద్రిక్తత… రాజకీయ దౌర్జన్యంపై తీవ్ర ఆగ్రహం..!!
క్రైమ్ అనాల్సిస్ - టివియస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌పై జరిగిన దాడి జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రణాళికాబద్ధంగా కొందరు కూటమి నాయకులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడి సమయంలో గణేష్ ప్రయాణిస్తున్న కారును పూర్తిగా ధ్వంసం చేసినట్లు సమాచారం.ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గణేష్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక చర్యలు జరగడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఖండనలు వెల్లువెత్తిన నేతలు
ఈ ఘటనను ఖండిస్తూ యలమంచిలి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు సంఘీభావం ప్రకటించారు. జడ్పిటిసి సేనాపతి సంధ్యా రాము, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు త్రినాధరావు, యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జల్లి ఆదిరెడ్డి, రోలుగుంట జడ్పిటిసి లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.
సేనాపతి సంధ్యా రాము మాట్లాడుతూ,“ఇలాంటి నీచమైన చర్యలు కూటమి నాయకులకు అలవాటుగా మారాయి. ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదు. ఇకనైనా తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు,” అని తీవ్రంగా హెచ్చరించారు.
పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Breaking News

Subscribe our Newsletter