ఏలూరు, ఉపాధ్యాయులకు AI టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ...!

ఏలూరు, ఉపాధ్యాయులకు AI టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ...!

14/May/2026 21:16    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,

సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి వారి ఆదేశాల ప్రకారం, గౌరవ APSWREI సెక్రెటరీ ప్రసన్న వెంకటేష్. వి IAS, సాంఘిక సంక్షేమ గురుకులాలులో పనిచేస్తున్న మాథ్స్ మరియు సైన్స్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు, ఇందుకుగాను Kotak education foundation, Mumbai వారీ ద్వారా AI Tools ఉపయోగించి విద్యార్థులకు అత్యాధునికత విద్యను ఎలా అందించాలి, విద్యార్థులలో నాయకత్వ లక్షణాన్ని ఎలా పెంపొందించాలి అనే అంశంపై హోటల్ N ఏలూరు నందు 11.05.2026 నుండి  14.05.2026 వరకు శిక్షణా తరగతులు నిర్వహించారని యన్. భారతి, డిస్టిక్ కోఆర్డినేటర్ APSWREIS , ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లా వారు గురువారం తెలిపారు.  ఈ శిక్షణలో ఏలూరు, పశ్చిమగోదావరి తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లాలులో ఉన్నటువంటి మ్యాథ్స్ మరియు సైన్స్ టీచర్లు పాల్గొన్నారు. గౌరవ అడిషనల్ సెక్రటరీ K.రాజ్యలక్ష్మి గారు, మరియు AMO S.రూపవతి గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
Breaking News

Subscribe our Newsletter