రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా బొద్దపు ఎర్రయ్య దొర నియామకం..!

రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా బొద్దపు ఎర్రయ్య దొర నియామకం..!

16/May/2026 21:57    Share:   

క్రైమ్ అనాలిసిస్ | టీవీఎస్ ప్రకాష్ – ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్

అనకాపల్లి జిల్లా, యలమంచిలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొద్దపు ఎర్రయ్య దొరను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని విశేష సేవలు అందిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నాయకత్వానికి అండగా నిలుస్తున్న నాయకుడిగా ఎర్రయ్య దొర గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఈ నియామకాన్ని ప్రకటించింది.
శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి Y.S.Jagan Mohan Reddy సమక్షంలో నియామక ఉత్తర్వులను ఎర్రయ్య దొరకు అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు బొద్దపు ఎర్రయ్య దొరకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Breaking News

Subscribe our Newsletter