అనకాపల్లి యువకుడు అదృశ్యం

అనకాపల్లి యువకుడు అదృశ్యం

14/April/2026 22:04    Share:   

అనకాపల్లి పట్టణం గవరపాలెం, నూకాలమ్మ టెంపుల్ వీధి నివాసి గంజరబోయిన రామకృష్ణారెడ్డి (48) గారు తన కుమారుడు గంజరబోయిన భాస్కర్ రెడ్డి (19) కనిపించడం లేదని అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తేదీ 13.04.2026 మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని Franklin Institute of Air Hostess Training సెంటర్‌కు వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన భాస్కర్ రెడ్డి రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అతను కోచింగ్ సెంటర్‌కు వెళ్లలేదని, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉందని తెలిసింది.తదుపరి కుటుంబ సభ్యులు విశాఖపట్నం ప్రాంతంలో వెతికినా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో, 14.04.2026న అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఎవరైనా సదరు యువకుడి గురించి సమాచారం తెలిసినట్లయితే దయచేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయగలరు.
క్రైమ్ ఎనాలిసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్.

Breaking News

Subscribe our Newsletter