లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు: సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపు..

లేబర్ కోడ్‌ల రద్దు వరకు పోరాటం ఆగదు: సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపు..

01/May/2026 13:40    Share:   

లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాడాలి.మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడాలి.ఘనంగా జరిగిన కార్మికుల పండుగ 104వ మేడే.భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య. సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు.ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్.

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 

భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) సంయుక్తంగా 104వ మేడే కార్యక్రమాన్ని వాడవాడల ఏఐటీయూసీ, సిపిఐ పార్టీ జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ అమెరికా దేశంలో చికాగో నగరంలోని హే మార్కెట్లో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి ప్రాణత్యాగాల ద్వారా సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి ఏటా మే ఒకటవ తేదీని ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పండుగగా మేడేగా జరుపుకుంటారని తెలిపారు. మనదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎనిమిది గంటల పదిని విధానాన్ని మార్పు చేసి 10,12 గంటలు కార్మికులు శ్రమ చేసే విధంగా చట్టాలను చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు దేశంలోని కార్మిక వర్గం ఉద్యమాలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రమజీవులు అందరికీ పండుగ రోజు మేడే అని కొనియాడారు. మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగరవేసిన సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా అక్కడి శ్రామిక వర్గం చేసే శ్రమపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అటువంటి శ్రామికులందరూ పండుగ రోజుగా జరుపుకునే మేడే అనేక పోరాటాల ద్వారా సాధ్యమైందని తెలిపారు. కార్మికులు కర్షకులు తమ హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేయాలని తద్వారా ప్రభుత్వాలు అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయగలమని పిలుపునిచ్చారు. 16వ డివిజన్, అరుంధతి పేట శాఖలో ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించిన కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను రక్షించుకోవాల్సిన పరిస్థితి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని విమర్శించారు. ఖండ్రికగూడెం శాఖలో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించిన మావూరి విజయ మాట్లాడుతూ అనేక మంది కార్మికుల ప్రాణత్యాగాలతో జరుపుకుంటున్న మేడే ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. పాలతూము సెంటర్లో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించిన భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రామికుల పండుగ రోజు మేడే ను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన యూనియన్ అధ్యక్షులు తమ్మిశెట్టి రమణయ్య మాట్లాడుతూ దేశంలో కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆటోమొబైల్ ఆల్ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించిన జెండా ఆవిష్కరించిన యూనియన్ అధ్యక్షులు ఉప్పులూరి కేశవరావు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని కార్మిక సంఘాలను పటిష్టపరుచుకోవాలని పిలుపునిచ్చారు. 40 డివిజన్ లో పార్టీ జెండా ఆవిష్కరించిన ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గం చేసే ప్రతి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు సహకారం ఉంటుందని తెలిపారు. ఆటోనగర్ లో మేడే జెండా ఆవిష్కరణ చేసిన అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేసి అనేక చట్టాలను కార్మికులకు సాధించి పెట్టారని వాటిని మార్పు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే విధంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాలలో ఏలూరు ఏరియా సమితి సభ్యులు కొండేటి రాంబాబు,కె రమేష్, మోరు అమర్నాథ్, మరకాల సందీప్, దాసిపల్లి ఆదినారాయణ, వేముల వెంకటేష్, దాసిపల్లి ఎర్రయ్య, చేపూరి రాజు, యలగాడ శివకుమార్,
ఉప్పులూరి లక్ష్మి,భవాని, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు శాఖ అధ్యక్షులు బంగారు దుర్గాప్రసాద్, అడపా సత్యనారాయణ, కాశి, తాళ్లూరి బాబురావు, మహబూబ్ షరీఫ్,రవికుమార్,అబ్దుల్ లుక్మన్, లక్ష్మణరావు, జుజ్జువరపు సన్నీ, ఎర్ర వెంకటేశ్వరరావు, పంతం రాంబాబు కొండేటి ఆదామ్, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter