ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ వజ్రప్రహర్
23/May/2026 21:51
Share:
ఏలూరు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ వజ్రప్రహర్ లో భాగముగా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీ కృష్ణ యాదవ నగర్ కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. ఉదయం 05:30 గంటల నుండి 08:00 గంటల వరకు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణ యాదవ నగర్, సత్రంపాడు ప్రాంతంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడినది. పాల్గొన్న పోలీసు అధికారులు ఏలూరు డీఎస్పీ శ్రీ డి శ్రావణ్ కుమార్ గారు ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కే రామకృష్ణ గారు ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ గారు ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గారు ఎక్సైజ్ ఎస్సై గౌరీ శంకర్ గారు ఇతర సిబ్బంది సంఖ్య – 60 మంది తనిఖీ చేసిన ఇళ్లు – 200 ప్రజలతో ఇంటరాక్షన్ చేసిన వారి సంఖ్య – 100 స్వాధీనం చేసుకున్న వాహనాలు – 18 మోటార్ సైకిళ్లు పెండింగ్ అరెస్ట్ – 01 గుర్తించిన పాత నేరస్తులు – 02 మంది అనుమానితులు / మాదకద్రవ్య వినియోగదారుల ఇళ్ల తనిఖీ – 05 పాత NDPS కేసుల నిందితుల తనిఖీ – 02 మంది అదేవిధంగా, గంజాయి గుర్తింపు టెస్ట్ కిట్ల ద్వారా 15 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 02 మందికి టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినది. సంబంధిత వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టబడుతున్నవి. *ఈ కార్యక్రమంలో పోలీస్, ఈగల్ టీమ్, ఎక్సైజ్ శాఖ, డాగ్ స్క్వాడ్ మరియు QRT బృందాలు పాల్గొని సంయుక్తంగా ఆపరేషన్ ను నిర్వహించినారు.