అనకాపల్లి జిల్లా ఏ.ఆర్.బలగాల వార్షిక డీ-మొబిలైజేషన్ ముగింపు

అనకాపల్లి జిల్లా ఏ.ఆర్.బలగాల వార్షిక డీ-మొబిలైజేషన్ ముగింపు

24/February/2026 15:26    Share:   

పోలీసుల నైపుణ్యమే సమాజ రక్షణకు ప్రాధాన్యత - జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ 
అనకాపల్లి (కైలాసగిరి), ఫిబ్రవరి 24: అనకాపల్లి జిల్లా సాయుధ రిజర్వ్ (DAR) పోలీస్ సిబ్బందికి గత 15 రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక డీ-మొబిలైజేషన్ కార్యక్రమం మంగళవారంతో విజయవంతంగా ముగిసింది. విశాఖపట్నం, కైలాసగిరి పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ముగింపు వేడుకకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.
​రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన పోలీసు బలగాల కవాతును ఎస్పీ గారు వీక్షించి, వారి క్రమశిక్షణను అభినందించారు.
​​ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికత మరియు సోషల్ మీడియా ప్రభావం దృష్ట్యా పోలీసులు తమ పనితీరులో నూతన దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పోలీస్ అంటే భయం కాదు, భరోసా అనే భావన ప్రజల్లో కల్పించాలని, ప్రతి చర్యలో పారదర్శకత, మానవత్వం ఉండాలని సూచించారు.అక్రమ సమావేశాలు, అనుమతి లేని ర్యాలీలను నియంత్రించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, చట్టపరమైన నిబంధనల ప్రకారం శాంతియుతంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ 15 రోజుల్లో నేర్చుకున్న ఆయుధాల వినియోగం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు మాబ్ కంట్రోల్ వంటి నైపుణ్యాలు విధి నిర్వహణలో వెన్నెముకలా నిలుస్తాయని పేర్కొన్నారు.
​​ఫిబ్రవరి 4 నుండి 18 వరకు జరిగిన ఈ శిక్షణా కాలంలో సుమారు 240 మంది ఏ.ఆర్.సిబ్బందికి ఈ క్రింది అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.​ 
ఆయుధాల వినియోగం: AK-47, SLR, ఇన్సాస్, కార్బైన్, పిస్టల్, MP-5 మరియు లాంచర్ల (UBGL) హ్యాండ్లింగ్ మరియు ఫైరింగ్ ప్రాక్టీస్.ఫిజికల్ ట్రైనింగ్, యోగా, ఆర్మ్స్ డ్రిల్ మరియు లాఠీ డ్రిల్.బాంబ్ డిస్పోజల్, వి.ఐ.పి సెక్యూరిటీ, వజ్ర (రైట్ కంట్రోల్ వెహికల్) వినియోగం.చట్టపరమైన నిబంధనలు (APCS & CCA), క్రమశిక్షణ, ఆరోగ్యంపై డాక్టర్ల సలహాలు మరియు ఆర్థిక క్రమశిక్షణపై చార్టర్డ్ అకౌంటెంట్లచే ఉపన్యాసాలు.సిబ్బంది సంక్షేమం  ​పోలీసు విధులతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం మరియు కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని ఎస్పీ గారు హితవు పలికారు. 
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన అదనపు ఎస్పీలు శ్రీ ఎం.దేవ ప్రసాద్, శ్రీ ఎల్.మోహన రావు, ఎస్.బి. డీఎస్పీ శ్రీ జీ.ఆర్.ఆర్.మోహన్ మరియు ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.​ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవరావు, ఆర్ఎస్సై ఆదినారాయణ మరియు ఇతర  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter