
అనకాపల్లి జిల్లాలోని బ్రాందీ షాపులు, వైన్ షాపులు బీరు బాటిల్ పై పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. రాత్రి 10 గంటలకు మూయవలసిన షాపులు 10:30 దాటినా తెరిచి మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి అని. ఈ అక్రమాలపై, పన్నుల శాఖ, ఎక్సైజ్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని. లంచాల ముసుగులో వైన్ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సూరిశెట్టి వరాహ విజయ రామచంద్రరావు ఆరోపిస్తున్నారు.అనకాపల్లి జిల్లా, చోడవరం ప్రాంతాల్లో వైన్ షాపులు అధిక ధరలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అని.రాత్రి సమయాల ఉల్లంఘనతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి అని.,అధికారులు కూడా ఈ అక్రమాలపై స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ విషయంపై కలెక్టర్ గారిని, డిఎస్పి గారిని కలసి ఫిర్యాదు చేయనున్నాం అని ఒక ప్రకటనలో తెలిపారు.”
అక్రమాలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తీవ్రంగా ఖండిస్తోంది.ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు సూరిశెట్టి వరాహ విజయ రామచంద్రరావు కోరుతున్నారు.