ప్రకృతి సాగులో నవధాన్యాల విత్తనం వల్ల రైతులకు అనేక విధాల లాభాలు..ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్
25/April/2026 21:44
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా వెంకటలక్ష్మి ప్రకృతి వనరుల బయో రిసోర్స్ సెంటర్‌లో శనివారం సీడ్ కిట్ల తయారీ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. తొలివిడతగా సుమారు 800 కిట్లు సిద్ధం చేయగా, ప్రతి కిట్లో 22 నుండి 25 రకాల విత్తనాలు, మొత్తం సుమారు 15 కిలోల బరువుతో రైతులకు అందుబాటులో ఉంచారు.ఒక్కో కిట్ ధరను రూ.1300 రైతులకు అందిస్తున్నామని వెంకటేష్ తెలియజేసారు. నవధాన్యాల పంటలు వేసుకోవడం ద్వారా నేల ఎర్రదనాన్ని తగ్గించి, సంవత్సరం పొడవునా భూమి పచ్చగా కప్పబడి ఉంటుందని, దీంతో కలుపు మొక్కల నియంత్రణ జరుగుతుందని, అలాగే నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, భూసారం మెరుగుపడుతుందన్నారు. భూమి గుబ్బలా మారి నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు ఎండల సమయంలో పంటకు తట్టుకునే శక్తి పెరుగుతుందన్నారు.ఇంకా ఈ నవధాన్యాల పంటలు పురుగులు, తెగుళ్లను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయని,నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు, వానపాముల సంఖ్య పెరిగి జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుందన్నారు.వేర్ల వ్యవస్థ బలపడటంతో లోతైన కండరాలు కాపాడబడి, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట నిలబడే శక్తి పెరుగుతుందన్నారు. అలాగే పంట దిగుబడులు, నాణ్యత, పోషక విలువలు పెరిగి రైతుకు అధిక ఆదాయం లభిస్తుందని, . ఈ నవధాన్యాల పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా ఉపయోగపడటంతో పాలు ఉత్పత్తి మరియు పాలు నాణ్యత కూడా మెరుగుపడుతుందన్నారు. రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం తగ్గి ప్రకృతి వ్యవసాయం మరింత బలోపేతం అవుతుందని వెంకటేష్ తెలియజేసారు. .