అనకాపల్లి జిల్లాకు తక్షణమే తూర్పుకాపు డైరెక్టర్లును నియమించాలి..!!
08/April/2026 19:41
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : తూర్పుకాపు సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి (లాయరు) డిమాండ్ అనకాపల్లి జిల్లాలో అధిక జనాభా కలిగిన తూర్పుకాపు సామాజిక వర్గానికి రాష్ట్ర తూర్పుకాపు డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తూర్పుకాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి (లాయరు) డిమాండ్ చేశారు. కనీసం ముగ్గురు డైరెక్టర్లను తక్షణమే నియమించాలని ఆయన కోరారు.బుధవారం యలమంచిలిలో నిర్వహించిన జిల్లా తూర్పుకాపు కోర్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీహరి మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల్లో తూర్పుకాపులు సంఖ్యాపరంగా మొదటి స్థానంలో ఉన్నారని తెలిపారు. అలాగే నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉన్నారని వివరించారు.ఈ పరిస్థితుల్లో జిల్లాకు తగిన ప్రాధాన్యతనిచ్చి కనీసం ముగ్గురు తూర్పుకాపు డైరెక్టర్లను నియమించడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనకాపల్లి జిల్లా నుంచి గొల్లవిల్లి ప్రభావతి సంజీవరావును రాష్ట్ర తూర్పుకాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించిందని ఆయన గుర్తుచేశారు.ఈ సమావేశంలో జిల్లా తూర్పుకాపు కోర్ కమిటీ సభ్యులు అడపా శేషగిరిరావు, సిరిగిరిశెట్టి నానాజీ, వెలంశెట్టి శ్రీనివాసరావు, నక్కా శివశంకరరావు, ఇన్నం రమణ, అన్నం స్వరాజ్యరావు, అందే రమణ, పోలిన సూర్య జగ్గారావు, బలిరెడ్డి సూరిబాబు, టివియస్ ప్రకాష్, ఆకుల వెంకటేష్, శెన్నంశెట్టి రామునాయుడు, ఆది, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.