ఇంటింటా అమరావతి పండుగ కొక్కిరాపల్లి లో పప్పల చలపతిరావు

ఇంటింటా అమరావతి పండుగ కొక్కిరాపల్లి లో పప్పల చలపతిరావు

05/April/2026 20:47    Share:   

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటా అమరావతి పండుగ
కొక్కిరాపల్లి లో పప్పల చలపతిరావు గారు

అమరావతికి చట్టబద్ధత లభించడంపై యలమంచిలి  నియోజకవర్గంలో  యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాపల్లి గ్రామంలో  గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో ఇంటింటా  సంబరాలు నిర్వహించారు. ప్రతి గడపలోనూ అమరావతి రంగవల్లులు మెరిశాయి. యలమంచిలి నియోజకవర్గమంతటా   అమరావతి పేరుతో మారుమ్రోగింది.   మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు గారు  యలమంచిలి నియోజకవర్గ పరిధిలో  యలమంచిలి మున్సిపాలిటీ ఉన్న కొక్కిరాపల్లి గ్రామంలో అమరావతి కి మద్దతుగా వేసిన రంగవల్లుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధానికి మద్దతుగా రంగవల్లులు వేసి అమరావతికి జై కొట్టారు. అమరావతి వర్ధిల్లాలంటూ నినదించారు. రంగుల హోలీ ఆడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధాని అమరావతి అంటూ జేజేలు పలికారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పప్పల చలపతిరావు గారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆకాంక్షల నెరవేరాయని అందుకే ఊరు వాడా అని తేడా లేకుండా ఇంటింటా అమరావతి సంబరాలు చేసుకుంటున్నారన్నారు. మూడు ముక్కలాట ఆడిన జగన్ కు బుద్ధి వచ్చిందని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల కోరిక నెరవేరిందని భవిష్యత్తులో ఎవరూ మార్చలేని విధంగా చట్టబద్ధత లభించిన శుభ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గం తరఫున ప్రధాని మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకులు నారా లోకేష్ గారికి తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి ఏకైక రాజధాని కావాలని తపించిన ప్రతి హృదయానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి,రాజాన సూర్య నాగేశ్వరరావు,మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ,దాడి రమేష్, వీసం కోటిబాబు,దంట్ల వెంకట స్వామి,సేనాపతి రాజారావు తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter