రూ.50 లక్షలతో కొక్కిరాపల్లిలో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం..!!

రూ.50 లక్షలతో కొక్కిరాపల్లిలో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం..!!

02/July/2026 14:48    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు (కొక్కిరాపల్లి)లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో వెనుకబడిన ఈ వార్డుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా. పి. నారాయణ హామీ మేరకు మొత్తం రూ.1 కోటి నిధులు మంజూరు చేయగా, తొలి విడతగా రూ.50 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నిధుల మంజూరులో స్థానిక ఎమ్మెల్యే  సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రోడ్లు కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కీలక సహకారం అందించారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేసిన మంత్రి డా. పి. నారాయణ, ఎమ్మెల్యే  సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రోడ్లు కార్పొరేషన్ చైర్మన్  ప్రగడ నాగేశ్వరరావు కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, గ్రామ పెద్ద మజ్జి రాంబాబు, మాజీ కౌన్సిలర్ మజ్జి వీరబాబు, టౌన్ అధ్యక్షులు గొర్లె శివన్నారాయణమూర్తి, రూరల్ అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు తదితరులు కొబ్బరికాయ కొట్టి సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వార్డు అధికారులు, అడ్మిన్ అరవింద్, శానిటేషన్ సెక్రటరీ సోమేశ్, గ్రామ పెద్దలు భైరవభట్ల శివరాం, పి. రాంబాబు, మజ్జి శివకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ కొటారు సాంబ, దాడి రమేష్, బాబురావు, వెంకటస్వామి, నానాజీ, నూకరాజు, శ్రీనివాసరావు, నాయుడు, సోమేశ్, కొండలరావు, గణేష్, సూరిబాబు, నాగేష్, శ్రీను, సాయి, గ్రామ జ్యోతి యువతతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter