అనకాపల్లిలో జైల్‌భరో.రైతులు, కార్మిక నాయకుల అరెస్ట్..

అనకాపల్లిలో జైల్‌భరో.రైతులు, కార్మిక నాయకుల అరెస్ట్..

10/August/2026 19:39    Share:   

కేంద్ర విధానాలపై నిరసనగా క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్‌భరో

అనకాపల్లి: రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా అనకాపల్లిలో సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం, మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు సీఐటీయూ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కేంద్ర విధానాలపై తీవ్ర విమర్శలు

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లోకనాథం మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మికులకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మూడు రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ, వాటిని దొడ్డిదారిన అమలు చేస్తూ వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు.

29 చట్టాల రద్దుపై అభ్యంతరం

29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టారని అన్నారు. పని గంటల పెంపు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా రైతులు, కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కౌలు రైతులకు రుణాలు అందించాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అదనంగా బాదామి కూలీలకు 200 రోజులు పని కల్పించి రూ.700 వేతనం నిర్ణయించాలని కోరారు.

Breaking News

Subscribe our Newsletter