శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు..!!

శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు..!!

17/March/2026 11:45    Share:   

శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండగను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు..!!
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్) యలమంచిలి :
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కొత్త అమావాస్య పండగ సందర్భంగా శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతి కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
అమ్మవారి పండగను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం కేశఖండనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అలాగే తొండాలు ఏర్పాటు చేసి భక్తులు సులభంగా మొక్కులు చెల్లించుకునేలా చర్యలు తీసుకున్నారు.
పలువురు దాతల సహకారంతో భక్తులకు మజ్జిగ, అమ్మవారి ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఆలయం మరియు ప్రాంగణం అంతటా విద్యుత్ దీపాలంకరణలు, ప్రత్యేక లైటింగ్ సెట్‌లు ఏర్పాటు చేసి ఉత్సవ వాతావరణాన్ని సృష్టించారు.
అమ్మవారి ఘటాలు గ్రామ పురవీధుల్లో విహరించే సమయంలో అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.
Breaking News

Subscribe our Newsletter