ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి.
13/July/2026 20:18
Share:
#రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారించాలి # ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా. #పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. #ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి , బందెల నాసర్ జీ.,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సాయి కుమార్,ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ నుండి వందలాదిమంది విద్యార్థులతో కలిసి ర్యాలీ ప్రదర్శన చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బందెల నాసర్ జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా రంగ సమస్యల నిలయంగా మారిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీల విద్య వరకు అనేక సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయని ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించక దశాబ్ద కాలంగా ఖాళీగా ఉన్న కుక్, కమాటి, వార్డెన్ పోస్టులు భర్తీ కాకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయని డిగ్రీ బీటెక్ పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికెట్ చేతికి రాక కళాశాల చుట్టూ తిరుగుతున్నారని రాష్ట్రంలో 6400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండిపోవడం వలన దిక్కుతోచని స్థితిలో విద్యార్థులను నిట్టేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్,డిగ్రీ,పాలిటెక్నికల్ ఐటిఐ. కళాశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తేవాలని కోరారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను గాలికి వదిలేసి నిధులు కేటాయించక విద్యార్థులు తక్కువ ఉన్నారని నెపంతో చాలా వరకు డిపార్ట్మెంట్లను క్లోజ్ చేస్తున్నారని యూనివర్స్ లో టీచింగ్ నాల్ టీచింగ్ పోస్టులు మూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని పోస్టులు భర్తీ చేయకపోవడం వలన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవు తుందని. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ చదువుకునే కలలు కొంటున్న విద్యార్థులకు జీవో నెంబర్ 77 వలన వారికి ఫీజు రీయంబర్స్మెంట్ వర్తించకపోవడం చాలా వరకు పీజీ కళాశాలలు మూతపడడం వలన విద్యార్థులు ఉన్నత విద్య కు దూరమవుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అధికారంలోనికి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పి ఇంతవరకు దాన్ని ఊసే పట్టకపోవడం విద్యార్థులను మోసం చేయడమని మండిపడ్డారు ఈ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి కే. సిద్దు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యులు ఎండి . సాధిక్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఏ. జగదీష్, ఎస్. రంజిత్, ఎన్. యస్వంత్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి సభ్యులు నాయకులు టీ. చంటి, బి. మధు, ఎన్. హర్ష, వెంకటేశ్వరరావు,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.