మద్యం దుకాణంలో కత్తితో దాడి.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
అనకాపల్లి: మద్యం కోసం దుకాణానికి వెళ్లి డబ్బులు చెల్లించకుండా దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా, కత్తితో దుకాణదారుడిపై దాడి చేసిన రౌడీషీటర్ దాడి అరుణ్ కుమార్‌ను అనకాపల్లి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం బాటిల్‌కు డబ్బులు అడిగినందుకు తనను తాను రౌడీషీటర్‌గా పరిచయం చేసుకుంటూ దుకాణదారుడిని బెదిరించాడు. అనంతరం దుకాణంలోకి చొరబడి మద్యం బాటిల్ తీసుకోవడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేశాడు.
ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు రౌడీషీటర్లు చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి టౌన్ పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ