విద్యాసంస్థల పరిసరాల్లో తనిఖీలు–COTPA చట్టం ప్రకారం జరిమానాలు.
04/August/2026 19:37
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు
ఈగల్ ఐజీపీ శ్రీ ఆకే.రవికృష్ణ, ఐపీఎస్ గారు మరియు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ డిపార్ట్మెంట్ మరియు ఏలూరు టూ టౌన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో COTPA చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న మూడు షాపులను గుర్తించి, సంబంధిత నిబంధనల ప్రకారం వారికి జరిమానాలు విధించడం జరిగింది. అలాగే షాపు యజమానులకు COTPA చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించడం జరిగింది. ?ఈ సందర్భంగా ఈగల్ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సులోనే పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడకుండా, తద్వారా మాదకద్రవ్యాల బారిన పడకుండా నివారించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ?అలాగే, 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించినా లేదా విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించినా COTPA చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ?ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ – 1972 గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 టోల్-ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో 112కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. ?విద్యార్థుల ఆరోగ్యం, భద్రత మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఈగల్ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయ భాస్కర్ తెలిపారు.