కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా చిరంజీవి గారి 71వ పుట్టినరోజు వేడుకలు..
పద్మ విభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను శనివారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు హాజరయ్యారు. తొలుత నగర కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాక సేవారంగంలోనూ మొదటగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ అని పేర్కొన్నారు.. ప్రమాదవశాత్తు రక్తమందట ఎంతోమంది మరణానికి గురవుతుంటే, అటువంటి మరణాలు మరల పునరావృతం కాకుండా ఉండాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించి, ఎంతోమంది అభిమానుల చేత రక్తదానం చేయాలని, వారిలో స్ఫూర్తిని కలిగించిన వ్యక్తి డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే కంటి చూపు లేని వారికి నేత్రదానం చేయమని, ప్రజలకు మరియు అభిమానులకు సూచనలు చేసిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవి గారిదే. అటువంటి సేవా భావం కలిగిన వ్యక్తి చిరంజీవి గారు, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ ప్రపంచంలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ఎన్నో అద్భుత పాత్రలతో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మహానటుడు చిరంజీవి గారి, సేవా మార్గంలో అడుగులు వేస్తూ, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు వంటి కార్యక్రమాల ద్వారా జీవనదాతగా, మానవతావాది గా నిలిచారు.. మెగాస్టార్ చిరంజీవి గారు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.. ఆయన చూపిన మార్గంలో అభిమానులు నడుస్తుండటం సమాజానికి ఆదర్శప్రాయం.. రక్తదానం, వైద్య శిబిరం, అన్నదానం వంటి కార్యక్రమాలు, చిరంజీవి సేవా తత్వాన్ని ప్రతిబింబిస్తాయి అని అన్నారు.. అలాగే మెగా ఫ్యామిలీ శుభ కార్యాలు జరిగినప్పుడల్లా మెగా అభిమానులు ప్రజా సేవలో పాల్గొనడం ఒక ఆదర్శం అని కొనియాడారు.. చిరంజీవి గారి కుమార్తె కొణిదల సుష్మిత గారు ఏర్పాటు చేసిన, మెగా యూత్ ఫోర్స్ టీమ్ కు ఏలూరు నియోజకవర్గం నుండి నియమితులైన కట్టా ఆది, దేవబత్తుల అరవింద్, రామిశెట్టి కళ్యాణ్ లను ఆయన అభినందించారు.. రాబోయే రోజుల్లో ఏలూరులో మెగా అభిమాన సంఘాలు, మెగా యూత్ ఫోర్స్ సభ్యులు అందరూ కలిసి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు మెగా అభిమాన సంఘాల నాయకులు శానం శ్రీరామకృష్ణమూర్తి గారు, పి.జగన్ గారు, సురేష్ మాష్టారు గారు, ఈదుపల్లి పవన్ గారు, డి.పెదబాబు గారు, టి.నరేష్ గారు, కోమాకుల శీను గారు, దోసపర్తి రాజు నాయుడు గారు, ఏలూరు మెగా యూత్ ఫోర్స్ కట్టా ఆది గారు, దేవబత్తుల అరవింద్ గారు, రామిశెట్టి కళ్యాణ్ గారు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ గారు, నగర అధ్యక్షులు వీరంకిపండు గారు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్ గారు, సరిది రాజేష్ గారు, రెడ్డి గౌరీ శంకర్ గారు, బొత్స మధు గారు, బోండా రాము నాయుడు గారు, ఎట్రించి ధర్మేంద్ర గారు , వాసా సాయి గారు, కొండల ప్రసాద్ గారు, నూకల సాయి ప్రసాద్ గారు, లక్కింశెట్టి కిరణ్ గారు, అచ్యుత్ నాని గారు, మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు పాల్గొన్నారు..