కొత్తూరులో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మరియు మెరుపుల వేడుకలు  అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు..!

కొత్తూరులో శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మరియు మెరుపుల వేడుకలు అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు..!

23/April/2026 21:11    Share:   

శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న పలువురు నాయకులు..!
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని మామిడి వాడ కొత్తూరులో శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మరియు మెరుపుల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కర్ణం ధర్మశ్రీ, అనకాపల్లి మాజీ ఎంపీ డాక్టర్ బిశెట్టి సత్యవతి, డాక్టర్ విష్ణుమూర్తి తదితర ప్రముఖులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించగా, వేద పండితుల నుండి ఆశీర్వాదాలు పొందారు. జాతర సందర్భంగా పలు గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో భజనలు, కచేరీలు నిర్వహించబడగా, భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. కర్ణం ధర్మశ్రీ స్వగ్రామం కావడంతో, ఆయన పిలుపుమేరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విస్తృత విందు భోజనానికి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. రాంబిల్లి మండలం చిన్న కలవలపల్లి కార్యకర్తలతో పాటు అనకాపల్లి జిల్లా యూత్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జల్లి ఆదిరెడ్డి, ఉప్పలూరు కిరణ్, మాజీ జడ్పిటిసి సేనాపతి సంధ్యారాము, బొద్ధపు ఎర్రయ్య దొర, బోదెపు గోవింద్, ఏబీఎన్ రాజు, ఆర్.ఎస్. నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter