క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్త్రాంద్ర జోనల్ ఇంచార్జ్ :
విశాఖపట్నం:
హర్యానా గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరగనుంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో గల కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 9:45 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు హాజరుకానున్నారు. బిజెపి నేతలు సోము వీర్రాజు, పి.వి.ఎన్. మాధవ్, అలాగే మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా స్వదేశీ జాగరణ మంచ్ కన్వీనర్, అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీకి చెందిన పప్పు ఈశ్వరరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మేధావులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.