ఎస్.పి.బాలు 80వ జయంతి పాటలపోటీలకు ఆహ్వాన కరపత్రం విడుదల

ఎస్.పి.బాలు 80వ జయంతి పాటలపోటీలకు ఆహ్వాన కరపత్రం విడుదల

23/May/2026 19:42    Share:   

అనకాపల్లి, గానగంధర్వుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారి 80వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే ఉమ్మడి రాష్ట్రస్థాయి సినీ పాటలపోటీల ఆహ్వాన కరపత్రాన్ని సిద్దార్ధ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం గురువారం విడుదల చేశారు.స్థానిక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... అనకాపల్లి జిల్లా, యలమంచిలి పట్టణంలోని గుర్రప్ప కళ్యాణ మండపంలో స్వరఝరి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు మత్తుర్తి రామారావు నిర్వహణలో ఈ పోటీలు ఘనంగా జరుగుతాయని తెలిపారు.

పోటీల వివరాలు:

  • తేదీ: 04.06.2026 (గురువారం)

  • సమయం: ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

  • ప్రవేశ రుసుము: రూ. 150

  • వయోపరిమితి: లేదు (అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చు)

బహుమతులు:

  • ప్రథమ బహుమతి: రూ. 4,000 నగదు + షీల్డు + ప్రశంసాపత్రం

  • ద్వితీయ బహుమతి: రూ. 3,000 నగదు + షీల్డు + ప్రశంసాపత్రం

  • తృతీయ బహుమతి: రూ. 2,000 నగదు + షీల్డు + ప్రశంసాపత్రం

  • ప్రత్యేక బహుమతి: రూ. 1,000 నగదు + షీల్డు + ప్రశంసాపత్రం

  • అన్ని పోటీదారులకు షీల్డులు, మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుంది.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం:
సాయంత్రం 6:00 నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఎస్.పి.బాలు గారి సినీ సంగీత విభావరి నిర్వహిస్తారు.

విజేతలకు టి.టి.డి. మాజీ చైర్మన్ శ్రీ పప్పల చలపతిరావు, యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పిల్లా రమాకుమారి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారు.

పోటీల వివరాల కోసం స్వరఝరి సంస్థ అధ్యక్షులు శ్రీ మత్తుర్తి రామారావును సంప్రదించాలని కోరారు.

ఈ కరపత్ర విడుదల కార్యక్రమంలో సిద్దార్ధ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బొడ్డు సోమరాజు, అయ్యగారు వెంకట రమణమూర్తి, నందేల అప్పారావు, ఎల్.వి.ఏ.రామారావు, పిల్లా బుజ్జి, రెడ్డి చారుణ్య, నక్కిన హర్ష పాల్గొన్నారు.

అధ్యక్షులు, సిద్దార్ధ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్, అనకాపల్లి బల్లా నాగభూషణం

Breaking News

Subscribe our Newsletter