జనసేన నేతలు, కార్మికుల సమస్యలపై ఆర్టీసీ చైర్మన్, ఎండీతో మర్యాదపూర్వక భేటీ..

జనసేన నేతలు, కార్మికుల సమస్యలపై ఆర్టీసీ చైర్మన్, ఎండీతో మర్యాదపూర్వక భేటీ..

17/August/2026 19:49    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
విజయవాడ, ఆగష్టు 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విజయవాడ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణ రావు గారిని, ఆర్టీసీ వైస్ చైర్మన్ & ఎండీ శ్రీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం గారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, నెల్లూరు జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అప్పలనాయుడు గారి దృష్టికి వచ్చిన వివిధ ఆర్టీసీ సమస్యలను చైర్మన్ నారాయణ రావు గారికి, ఎండీ బాలసుబ్రహ్మణ్యం గారికి వివరించారు.
వారితో పాటు పలువురు ఆర్టీసీ కార్మికులు యార్లగడ్డ సీతారామయ్య గారు, వేముల కృష్ణారావు గారు, అంకెం అమర్నాథ్ గారు తదితరులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు.
వెంటనే స్పందించిన ఆర్టీసీ చైర్మన్ నారాయణ రావు గారు, ఎండీ బాలసుబ్రహ్మణ్యం గారు సమస్యలను పరిష్కరిస్తామని కార్మికులకు, నేతలకు హామీ ఇచ్చారు.
Breaking News

Subscribe our Newsletter