రణస్థలంలో ‘సేవా మేరా యోగ్దాన్’లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ కలిశెట్టి

రణస్థలంలో ‘సేవా మేరా యోగ్దాన్’లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ కలిశెట్టి

02/October/2026 19:24    Share:   

రణస్థలంలో ‘సేవా మేరా యోగ్దాన్’కు శ్రీకారం
మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, అక్టోబర్ 2:

‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ‘సేవా మేరా యోగ్దాన్’ పేరిట రణస్థలం మండల కేంద్రంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ లంక శ్యామలరావు, ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు, APTPC చైర్మన్ వజ్జా బాబురావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రణస్థలం మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహాల ప్రాంగణంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాయకులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వసతి గృహాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్రైమ్ అనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter